దమ్మపేట : ఎన్టీఆర్ కి మరణం లేదు ప్రజల హృదయాల్లో చిరకాలం సజీవంగా ఉన్నారు

గురువారం స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట(మండలం), మొద్దులగూడెం- నాయుడుపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మెచ్చా నాగేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ కి మరణం లేదని, ప్రజల హృదయాల్లో చిరకాలం సజీవంగా ఉన్నారని కొందరు దైవంగా ఆరాధిస్తారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీ ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దొడ్డ రమేష్, సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, ఎంపిటిసి దేవరపల్లి అజయ్, సోడెం గంగరాజు, మొద్దులగూడెం సర్పంచ్ సున్నం రాము,దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్, దొడ్డ శ్రీనివాస్ రావు, రావుల శ్రీను, సాయిల రామారావు, యార్లగడ్డ శ్రీను, యార్లగడ్డ బాబు, ఉయ్యాల లక్ష్మి నారాయణ, పండురీ వీరబాబు,పానుగంటి చిట్టి బాబు, ప్రసాద్, బండ్ల లక్ష్మయ్య, మధల సతీష్,ప్రసాద్,జలిపర్తి సాంబయ్య, సోయం శ్రీను,వడపల్లి యేసు,వజ్రపు లక్ష్మినారాయణ,రాములు, రూపా రాంబాబు,అబ్దుల్ జిన్నా,తదితరులు ఉన్నారు.
