Mon. Feb 2nd, 2026

సిరోల్ జనవరి-23 (J365న్యూస్) గిరిజన సామాజిక వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గుగులోత్ కిషన్ నాయక్ సారథ్యంలో తన కూతురు గుగులోత్ అర్చన జ్ఞాపకార్థం జిల్లా పరిషత్ హై స్కూల్, కొత్తూరు లో చదువుతున్న బాలబాలికలకు స్టడీ మెటరియల్స్ తో పాటు మహనీయుల జీవిత చరిత్రల పుస్తకాలు ఫూలే, అంబేడ్కర్,నారాయణ గురు, సాహు మహారాజ్, సావిత్రిబాయి ఫూలే జీవితచరిత్ర ల పుస్తకాలను కిషన్ నాయక్ ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసన సభ్యులు జాటోత్ రామ చంద్రునాయక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రామ్ చంద్రు నాయక్ ముఖ్య ఆతిది గా హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయుడు గా కిషన్ నాయక్ ఉపాధ్యాయులుగా ఉంటు సామాజిక సేవలు అందించడం అభినందనీయం అని అన్నారు.విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం అభినందనీయం అని అన్నారు.అలాగే మహనీయుల జీవిత చరిత్ర పుస్తకాలను కూడా హర్షణీయం కొనియాడారు. అంబేద్కర్, ఫూలే స్ఫూర్తి తో ముందుకు సాగాలని కోరారు.కష్టపడి చదవాలని పిలుపి ఇచ్చారు. కార్యక్రమం లో, తీన్మార్ మల్లన్న, బెల్లయ్య నాయక్,హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయలు ఇశ్లవత్ లచ్చిరాం, గ్రామ సర్పంచ్ యనాల గంగాధర్ రెడ్డి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు గుగ్గిల్ల పీరయ్య , అడ్వకేట్ కొప్పుల రమేష్ ,గ్రామస్తులు చిప్పరపల్లి వెంకన్న,పగడాల క్రిష్ణ రెడ్డి, మలిసెట్టీ వేణు, మల్సుర్, బదవత్ మంగి లాల్ విద్యార్దిని విద్యార్దుల తలిదండ్రులు పాల్గొన్నారు.

Share this post...