Mon. Feb 2nd, 2026

మహబూబాబాద్ 27 జనవరి (J365 news) రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ సైనికుల సంయుక్త బృందం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలోని ఆశాభవన్ అనాధ ఆశ్రమంలో భారత సైనికుడు తోట నగేష్ ఆధ్వర్యంలో పిల్లలకు వివిధ రకాల పండ్లను అందివ్వడం జరిగింది ఈ సందర్భంగా సైనికుడు నగేష్ మాట్లాడుతూ భారతదేశ నలుమూల సరిహద్దు ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న తన తోటి సైనికులు సెలవు రోజులలో తమ ఇండ్లకు వచ్చినప్పుడు ప్రతి ఒక్క సైనికుడు ఇలాంటి అనాధ ఆశ్రమాలను సందర్శించి తన వంతు సహాయ సహకారాలు అందించి ఈ అనాధ పిల్లలకు మనోధైర్యాన్ని ఇచ్చి భవిష్యత్తులో వారికి నా వాళ్లు ఎవరూ లేరు అనే బాధను పోగొట్టి వారికి తోడుగా ఉండాలని సైనికులు బోడ మల్సూర్, జగన్ నాయక్, బదుల సుధాకర్, ఎస్ శ్రీనివాస్ (CI ఎక్స్ ఆర్మీ) , సుబేదార్ సతీష్ (Ex Army) , సుబేదార్ సుభాష్ , సుబేదార్ తిలక్  కోరారు…

అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ ఈరోజుల్లో భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడే అక్రమార్కులను రోజు సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాం కానీ ఎక్కడో భారత దేశ సరిహద్దులలో కుటుంబాలను, భార్యా పిల్లలను వదిలేసి కంటి రెప్పకు నిద్ర లేకుండా నిరంతరం రోజుకు 24 గంటలు ఎండ, వాన, చలి అని చూడకుండా ఇక్కడ మనం సంతోషంగా, సుఖంగా, ఆనందంగా జీవించాలని దేశంలో అక్రమంగా చొరబడే వారితో యుద్ధాలు చేసి తమ ప్రాణాలపై ఆశ లేకుండా దేశ సరిహద్దుల్లో పహారాకాసే సైనికులు ఈరోజు ఒక బృందంగా ఏర్పడి ఎవరికి ఏ ఆపద వచ్చినా సరిహద్దుల్లోనే కాకుండా మాకు వచ్చే నెలవారి జీవితంలో మా కుటుంబాలను పోషించుకుంటూ ఎవరికైనా ఎటువంటి ఆపద సమయంలో సహాయం చేయడానికి మేమున్నామంటూ ముందుకు వస్తున్న సైనిక బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకుడు విజయ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share this post...