Sun. Feb 1st, 2026

J365 న్యూస్ (మహబూబాబాద్ జిల్లా) : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన ఆర్.బి.ఎస్.కె ఉద్యోగుల సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఆర్ బి ఎస్ కే ఉద్యోగుల సంఘం డాక్టర్ కుమార్ ని ఎన్నుకున్న ఆ సంఘం ప్రతినిధులు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ అంబరీష్ డి ఎం హెచ్ ఓ, డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్, ఆర్బిఎస్.కె జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్, ఆర్ బి ఎస్ కే జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ డి.కుమార్ లు పాల్గొని జిల్లా ఆర్ బి ఎస్ కే అధ్యక్షులు, కార్యవర్గ, ఈసీ మెంబర్లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కుమార్ మాట్లాడుతూ నాపై ఇంతటి బాధ్యతగా మోపిన ఈ అధ్యక్ష పదవిని సక్రమంగా నిర్వర్తించి, సద్భాగంలో నడిచి, ప్రతి మండల, గ్రామాల వారికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పారు. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ వివరాలు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ ప్రియాంక, డాక్టర్ సంజీవ్ నాయక్, అక్షిత, జనరల్ సెక్రెటరీ డాక్టర్ శివవరం, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ సౌజన్య, శ్రీజ, లావణ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ అశోక్, రఘునాథ్, సుమలత, ట్రెజరీ డాక్టర్ సాయి లక్ష్మి, సౌమ్యకుమారి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డాక్టర్ రేణుక శ్రీలక్ష్మి భవాని సుందర్ లాల్, డాక్టర్స్, మెడికల్ రిప్రజెంట్లు పాల్గొన్నారు.

Share this post...