– సమస్యల సాధనకై కదం తొక్కిన డిగ్రీ గెస్ట్ లెక్చరర్లు
– ఆత్మీయ సమ్మేళనం విజయవంతం
– టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
J365న్యూస్, హైదారాబాద్:
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విధులు నిర్వహించే గెస్ట్ లెక్చరర్ల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉండి సాధించుకుందామని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం హైదారాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదండరాం తో పాటుగా ప్రగతి భవన్ వార్ రూమ్ ఇంచార్జీ వార్ రూం ఛైర్మెన్ పవన్ మల్లాడి, టిజేఎస్ జనరల్ సెక్రెటరీ నిజ్జన రమేష్ లు పాల్గొన్నారు. ఈ సమ్మేళనం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొర్ర ఈశ్వర్ లాల్ ఆధ్వర్యం లో కొనసాగింది. ఈ సందర్భగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెస్ట్ లెక్చరర్లకు ఆటో రెన్యువల్, సమాన పనికి సమాన వేతనం, ప్రమాద భీమా వంటి సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని అమలు అయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా.కొర్ర ఈశ్వర్ లాల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న గెస్ట్ లెక్చలర్ల కష్టాలు ,సమస్యలు వర్ణానాథితమన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చలర్లను ఆటో రెన్యువల్ తో కంటిన్యూ చేసి , కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రతి నెలకు 50 వేల కన్సాలిడేటెడ్ పే అందించి, పీరియడ్ విధానాన్ని రద్దుచేసి 12 నెలలకు జీతంను తక్షణం అమలు చేయాలన్నారు. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ ద్వారా డిస్టర్బ్ అయ్యే గెస్ట్ లెక్చరర్ లను రీ లోకేట్ చేసి, ఇ హెచ్ యస్ కార్డులు జారీ చేసి,
ప్రమాదాలు , ఏదైనా రిస్కు జరిగిన ప్రమాద భీమా తో పాటు 20 లక్షల పరిహారం అందించి, డిగ్రీ గెస్ట్ లెక్చలర్లను కాంట్రాక్టు ఎంప్లాయిస్ /మినిమం టైం స్కేల్ల్ ఉద్యోగులుగా కన్వర్ట్ చేయాలని కోరారు.గెస్ట్ లెక్చరర్స్ తమ కవితలు, పాటల ద్వారా గెస్ట్ లెక్చరర్స్ ఎదుర్కుంటున్న సమస్యలపై పాటలు, కవితల రూపంలో వర్ణించారు. అంతకుముందు గెస్ట్ లెక్చరర్ల రాష్ట్ర నూతన క్యాలెండర్ ఆవిష్కరించి, అతిథులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల అసోషియేషన్ సెక్రటరీ గణేష్, జనరల్ సెక్రటరీ బగ్గు నాయక్, సభ్యులు జావిద్, నరేష్, అశోక్, శివ కుమార్, సురేష్ రెడ్డి పాల్గొన్నారు.
