J365 న్యూస్, కొత్తగూడెం : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి ఉత్సవాల సందర్భంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సంగం వెంకట పుల్లయ్య, కార్యదర్శి డా.పి విజయకుమార్, ఈ సందర్భంగా అధ్యక్షులు సంఘం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సమాజంలోని అసమానతులకై అంబేద్కర్ చేసిన కృషిని కొని ఆడారు బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శంగా తీసుకొని అని ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస రావు,..టిజిఓ నాయకులు రమేష్,డా.వెంకట్,డా.రమేష్,లక్ష్మన్ రావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్స్ సందీప్,కృష్ణయ్య., తదితరులు పాల్గొన్నారు.
