Tue. Mar 24th, 2026

J365న్యూస్,ఇల్లందు:  సింగరేణి ఇల్లందులో ఎస్ & పి సి పనిచేస్తున్న ప్రవేటు సెక్యూరిటీ గార్డులకి కాంట్రాక్టర్ 7వ తేదీ లోపు వేతనాలను చెల్లించనందుకు కాంట్రాక్టర్ కి రీజినల్ లేబర్ కమిషనర్ సెంట్రల్ ఫైన్ వేశాడు. ఒక్కొక్క కార్మికుడికి అదనంగా 1000 రూపాయలు చెల్లించాలని కాంట్రాక్టర్ మరియు సింగరేణి యాజమాన్యాలకు ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. ఇల్లందులోని ఎస్ & పి సి విభాగంలో ప్రవేట్ సెక్యూరిటీ గార్డులకు సాహితీ మ్యాన్ పవర్ ప్లేస్మెంట్ అండ్ సర్వీసెస్ ఏజెన్సీ కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్నది. సదరు కాంట్రాక్టర్ కాంట్రాక్టు కార్మికులకు ఏడవ తేదీ లోపు వేతనాలు చెల్లించాలన్న జిఎం పర్సనల్  ఆదేశాలను అమలు చేయలేదు. ప్రతి నెల వేతనాలు ఆలస్యంగా చెల్లించారు. దీనిపై సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం ( SCKS) సిఐటియు గా కాంట్రాక్టర్ కి మరియు ప్రధాన యజమాని అయిన సింగరేణి యాజమాన్యానికి అనేకసార్లు వినతి పత్రాలు అందజేశాము.సరిగా స్పందించలేదు.రీజనల్ లేబర్ కమిషనర్ కూడా సకాలంలో వేతనాలు చెల్లించాలని జూలైలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ దానిని సైతం కాంట్రాక్టర్ ,సింగరేణి యాజమాన్యం అమలు చేయలేదు. దీనితో ఆగస్టు నెల వేతనం ఏడవ తేదీలోపు చెల్లించలేదని పేమెంట్ ఆఫ్ వేజెస్ ఆక్ట్ -1936 ప్రకారం, లేబర్ కోర్టులో సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం ( SCKS) సిఐటియు ప్రధాన కార్యదర్శి బి మధు కేసు వేశారు.

ఈ కేసు పై విచారణ జరిగింది. విచారణ జరుగుతున్న సందర్భంగా తర్వాత నెల నుంచి ప్రతినెల ఏడో తేదీ లోపు వేతనాలను కాంట్రాక్టు చెల్లించారు. ఆగస్టు నెల వేతనం ఆలస్యంగా చెల్లించినందుకుగాను ఒక్కొక్క కార్మికుడికి నష్టపరిహారంగా వెయ్యి రూపాయలు చెల్లించాలని రీజనల్ లేబర్ కమిషనర్ సెంట్రల్ గారు సింగరేణి యాజమాన్యం మరియు కాంట్రాక్టర్ కి ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాలు జారీ చేయడం పట్ల సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘం ( SCKS) హర్షం వ్యక్తం చేశారు. ఈ నష్టపరిహారాన్ని తక్షణం కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును గుణపాఠంగా తీసుకొని సింగరేణి వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లు మరియు సింగరేణి యాజమాన్యం భవిష్యత్తులో వేతనాలను ఆలస్యం చేయకుండా 7 వ తేదీలోపు చెల్లించాలని సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో కేసులను వేయాల్సి ఉంటుందని హెచ్చరిక చేశారు.

Share this post...