Sun. Aug 9th, 2026

J365 NEWS, మహబూబాబాద్:    స్థానిక జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ మాజీ ఎంపీ భారతీయ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షు రాలు మాలోత్ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు హాజరై కేక్ కట్ చేసి కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించి పేదలకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహబూబాబాద్ జిల్లాలోనీ పలు మండలాలలో మాలోత్ కవిత పుట్టినరోజు వేడుకలను బి ఆర్ఎస్ నాయకులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మర్నేని వెంకన్న, జిల్లా నాయకులు పరకాల శ్రీనివాస్ రెడ్డి , ముత్యం వెంకన్న, మహబూబ్ పాషా, తేల్ల శ్రీనివాస్, రఘు, రవి ,శంకర్, ఖలీల్, అశోక్, వెంకన్న, కరుణాకర్, కిరణ్, యుగంధర్, సులోచన మరియు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share this post...