J365 NEWS, సుజాతనగర్ ( ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సుజాతనగర్ మండలంలో పార్టీ నిర్మాణం, రాబోయే ఎలక్షన్ లో ఎలా ముందుకు వెళ్లాలని అంశాల మీద సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిధులుగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి నాయకులకు కార్యకర్తలకు దశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న అందిస్తున్న పథకాలు సామాన్య ప్రజానికానికి అందుతున్నాయా లేదా గమనించాలని నిత్యం ప్రజలతో సంబంధాలు పెంచుకోవాలని ప్రజల మధ్యనే ఉండి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా అధికారుల సహాయ సహకారాలతో ముందుకు సాగాలని సూచించారు. అందరము సమిష్టిగా పనిచేస్తేనే స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో విజయం సాధిస్తామని సూచించారు. రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, పంట బోనస్, రైతు బీమా, 500 లకే గ్యాస్, ఉచిత కరెంటు తదితర పనులు పర్యవేక్షించి ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా నాయకులు కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యోన్ముఖుల కావాలని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తు విజయోత్సాహంతో ముందుకు సాగాలని కార్యకర్తలను నాయకులను ప్రోత్సహించారు. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త సమన్వయంతో పని చేయాలి అని, ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపు ప్రభుత్వం పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని, మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఉచిత డ్వాక్రా రుణాలు ఇచ్చి మహిళలను అభివృద్ధి పథంలో నడుపుతున్నదని, అలాగే రైతులకు పెద్ద పీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులకు 2018 నుండి డిసెంబర్ 9 2023 వరకు పంట రుణాలు తీసుకున్న వారికి 2 లక్షల పంట రుణమాఫీ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, అలాగే రైతు భరోసా కూడా నూతన సంవత్సరం సందర్భంగా రైతులకు అందిస్తాం అని, అలాగే రైతు కూలీలకు కూడా 12000 రూపాయల భరోసా అందిస్తాం అని కాబట్టి ప్రతి ఒక్క పథకం కూడా గడప గడపకు చేర్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు.
ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా మండల, జిల్లా నాయకత్వం ఉంటారని, ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులకు అందేలా నాయకులు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు సముచిత పదవులు దక్కుతాయని అన్నారు. అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యులు నగసీతారాములు, జిల్లా మహిళ అధ్యక్షురాలు దేవిప్రసన్న, సొసైటీ చైర్మన్ హనుమంతరావు, రైల్వే బోర్డ్ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి, నియోజక వర్గ నాయకులు. ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, మాజీ ఎంపిటిసి పూనెం శ్రీనివాస్, లింగం పిచ్చి రెడ్డి, భాగం మోహన్ రావు, మాజీ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆబిద్, కౌన్సిలర్ పూర్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.

