J365 NEWS, శ్రీకాకుళం: ఆడపిల్లలకు అండగా నిలుస్తామని, ఆడపిల్ల సేవా సొసైటీ అధ్యక్షురాలు, పొందూరు సచివాలయ ఉద్యోగి మడ్డి.లావణ్య శుక్రవారం అన్నారు. శ్రీకాకుళం స్థానిక మండలవీధిలో నివాసముంటున్న ఈ.లీలారాణి నిరుపేద కుటుంబానికి చెందిన విషయం విదితమే. తల్లి మరణించగా, తండి దీర్ఘకాలిక లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ అనారోగ్యకారణంగా మంచానికి పరిమితమయ్యారు. లీలారాణి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ, తండ్రికి చేదోడుగా నిలుస్తుంది. గతంలో ఆమె కుటుంబానికి పత్రికా ప్రతినిధి, సేవకులు ఉర్లం. శివతేజ అందించిన సమాచారంతో పెదపాడుకు చెందిన బొట్టా. సాయి కుమార్ నిత్యావసర సరుకులను అందించగా, నగరానికి చెందిన ట్రెజరీ హెల్పింగ్ హాండ్స్ ద్వారా మాదారపు.డేవిడ్, బెహరా.ప్రదీప్ బృందం అమ్మాయి పేరు మీద పదివేల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆదుకున్నారు. అయితే తండ్రి మంచం పట్టడంతో ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్నారు. కనీసం ఇంతే అద్దె కట్టడానికి కూడా స్థోమత లేకపోవటంతో విషయాన్ని శివతేజ ద్వారా తెలుసుకున్న ఆడపిల్ల సేవ సొసైటీ మడ్డి.లావణ్య ప్రతినెలా ఇంటి అద్దె కట్టడానికి ముందుకు వచ్చి, రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించారు. అనంతరం మాట్లాడుతూ ఆడపిల్లలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆడపిల్ల సేవ సొసైటీ స్థాపించామని, అటువంటి విద్యార్థులకు, పిల్లలకు ఎటువంటి సహాయక కావాలన్నా మా వంతు సాయమందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఆడపిల్ల సేవ సొసైటీ సభ్యులు డా.పైడి ప్రదీప్, సేవకులు ఉర్లం.శివతేజ, మండలవీధికి చెందిన బి.వినయ్ కుమార్, విద్యార్థిని లీలారాణి పాల్గొన్నారు.

