Wed. Jan 28th, 2026

J365 న్యూస్ కొత్తగూడెం( ):  కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పత్రులలో పలు వ్యాధులతో చికిత్స పొందిన 18 మంది లబ్ధిదారులకు 6,93,000 రూపాయిలు విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సంక్షేమ పథకాలు అందించడంలో కృషి చేస్తున్నారన్నారు. ఎంతోమంది సకాలంలో చికిత్స పొందలేక ప్రైవేట్ ఆస్పత్రిలలో అప్పులు చేసి, ఖర్చు పెట్టుకున్న బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మతల్లి గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరావు, సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, రైల్వే బోర్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు బాల పాసి, తలుగు అనిల్, మాధవరావు, హైమావతి, సుందర్ లాల్ కోరి, జయప్రకాష్, రవికాంత్, యూత్ కాంగ్రెస్ నాయకులు తాటి పవన్ ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.

Share this post...