Wed. Feb 4th, 2026

–సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు భూక్యా మోహన్ డిమాండ్

J365 న్యూస్, కొత్తగూడెం: సమగ్రశిక్ష లో ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ తక్షణమే మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని ప్రమాదవశాత్తు ఉద్యోగం చేస్తూనే మరణించిన కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయల ఎక్స్ప్రెషన్ వెంటనే చెల్లించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం కార్యాలయంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న బత్తుల రాజేష్ కార్యాలయ విధులకు ద్విచక్ర వాహనం పై వస్తుండగా మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు మహీంద్రా ట్రాలి ఢీకొట్టడంతో చనిపోయారని. రాజేష్ నిరుపేద వ్యక్తి అని కుటుంబానికి ఎటువంటి ఆసరా లేదని ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు సమ్మె చేస్తున్న కాలంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఏదైతే త్రిసభ్య కమిటీకి అన్ని వివరాలు అందజేస్తామని చెప్పి ఉన్నారు ఇప్పటికైనా సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర సంఘాన్ని చర్చలకు పిలిచి వెంటనే సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులకు రావలసిన అన్ని రకాల బెనిఫిట్స్ అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రమాదంలో మరణించిన ఎమ్మెల్యే కోఆర్డినేటర్ రాజేష్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులను జిల్లా శాఖ పక్షాన పరామర్శించడం జరిగింది.

ఈ కార్య క్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ బట్టు చందు సలహాదారులు వనమా సురేష్ కిరణ్ మై శ్రావణి మరియు అన్ని మండలాల ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కంప్యూటర్ ఆపరేటర్లు లక్ష్మీదేవి పల్లి మండల విద్యాశాఖ అధికారి బి కృష్ణయ్య దమ్మపేట మండల విద్యాశాఖ అధికారిని కే లక్ష్మి హెడ్మాస్టర్ శ్రీనివాస్ లక్ష్మీదేవి పల్లి మండల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Share this post...