J365 న్యూస్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మురళి నాయక్ క్యాంప్ ఆఫీస్ నందు యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఉదయం ప్రారంభమైన ఈ రక్తదాన శిబిరంలో యువత, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 60 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు.
జన్మదినం అంటే కేవలం వేడుక కాదు, సమాజానికి ఉపయోగపడే రోజుగా మార్చుకోవాలి అనే ఎమ్మెల్యే మురళీ నాయక్ సిద్దాంతం మేరకు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమం నిర్వహించారు.రక్తదానానికి ముందుకు వచ్చిన యువతకు ఫోన్ లో ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం జిల్లా కేంద్రంలో మహబూబాద్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మదన్ లోయ, జిల్లా పార్టీ నాయకులు పద్మం ప్రవీణ్ కుమార్, జిల్లా పార్టీ, మండల పార్టీ ఆధ్వర్యంలో కేకు కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసిన అనంతరం 3 వేల మందికి అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మదన్ లోయ, పద్మం ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకి, నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉంటాం. 3 వేలకు పైగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభిమానులు అన్నదానంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, మేము ప్రజల మనసులం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు దేవారం ప్రకాష్ రెడ్డి, రమేష్ చందర్ రెడ్డి, అంబటి మహేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పద్మం ప్రవీణ్ కుమార్, జన్నారెడ్డి వెంకటేశ్వర్లు, నీరుటి లక్ష్మీనారాయణ, పోతరాజు రాజు, మిట్ట కంటి రాంరెడ్డి, చిట్టే వెంకన్న, ఖలీల్ పాషా, రమేష్, బోడ రవి, బెల్లంకొండ శ్రీనివాస్, నర్సింగ శ్రీనివాస్, గునిగంటి కమలాకర్, బండి వెంకన్న, సుదర్శన చారి, ఏ రఘు, భూక్య శ్రీనివాస్, జిలుగుల భాస్కర్, చంటి, సాయి, శ్రీను, స్వర్ణలత, విజయలక్ష్మి, లక్ష్మి, తేజ, రాంపల్లి నవీన్, గొల్లపల్లి మహేందర్, మధు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మానుకోట నియోజకవర్గ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.


