–వలస సుభాష్ చంద్రబోస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలల హక్కుల ప్రజా వేదిక.
J365 NEWS: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాలల హక్కుల ప్రజా వేదిక ఆధ్వర్యంలో నవంబర్ 14 బాలల దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 సంవత్సరాల వయసుగల విద్యార్థులకు 34 రంగాలలో ప్రతిభ కలిగిన వారికి రాష్ట్రస్థాయి బాలమిత్ర అవార్డులు ప్రధానం హైదరాబాదులో ఏర్పాటు చేస్తున్నట్టు విద్యార్థులు దాగి ఉన్న సృజలాత్మ శక్తిని వెలికి తీసేందుకు రాష్ట్రస్థాయిలో బాలమిత్ర అవార్డులు ఇవ్వనున్నట్టు బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ తెలిపారు.
విద్యార్థులు దరఖాస్తు చేసే వివిధ రంగాలు: దేశభక్తి పాటలు. భరతనాట్యం. గిటార్. కీబోర్డు ప్లేయింగ్. ఫ్లూటు. పర్వతాహోరన. యోగా. చిత్రలేఖనం. కార్టూన్స్. కవిత్వం జానపద నృత్యం. జానపద పాటలు. మిమిక్రీ .మ్యాజిక్. సైకిలింగ్. వాలీబాల్. కబడ్డీ. కోకో బ్యాట్మెంటన్. చెస్. ఫుట్బాల్. రన్నింగ్. జాతీయ సమైక్యత శిబిరం.. కరాటే. కూచిపూడి. కోలాటం. తబలా. బతుకమ్మ.స్విమ్మింగ్. బాస్కెట్బాల్. స్కిటింగ్. .టెన్నిస్ . అర్చరి .ఈ రంగాలలో నైపుణ్యం గల విద్యార్థులకు వారి వద్ద ఉన్న మెరిట్ సర్టిఫికెట్లు ఆధారంగా మా బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్రస్థాయిలో బాలమిత్ర అవార్డులు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు దరఖాస్తు చివరి తేదీ 5.11.2025 రోజు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించబడును కావున నైపుణ్యం గల విద్యార్థులు వారి వద్ద ఉన్న మెరిట్ సర్టిఫికెట్లు ప్రెస్ క్లిప్పింగ్ పాటు బయోడేటా దరఖాస్తు దారిని ఫోటో జత చేసి వారి దరఖాస్తును పోస్ట్ ద్వారా స్వీకరించబడును ఈ అడ్రస్ కు వలస సుభాష్ చంద్ర బోస్ రాష్ట్ర అధ్యక్షులు బాలల హక్కుల ప్రజా వేదిక ఇంటి నెంబర్ 2-92 గ్రామము. కూరెల్ల. మండలం కోహెడ. జిల్లా సిద్దిపేట, పిన్ నెంబర్ 505473 పంపించగలరు ప్రతిభగల విద్యార్థులను కోరుచున్నాము.

