J365 న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేంద్రంగా పనిచేస్తున్న iGram Digihub Private Limited గ్రామీణ ప్రజలకు డిజిటల్ సేవలు, ఉపాధి, విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, ఆర్థిక సేవలు, ఈ-కామర్స్ వంటి అవకాశాలను చేరువ చేసే లక్ష్యంతో కార్యకలాపాలను విస్తరిస్తోంది.
ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే నాలుగు iGram డిజిటల్ సెంటర్లు ప్రారంభించింది. పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం, జానంపేట, అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి, పూసుగూడెంలో ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి.
ప్రభుత్వ, పౌర సేవలు, డిజిటల్ డాక్యుమెంటేషన్, విద్య, ఉద్యోగ సమాచారం, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, ప్రయాణ సేవలు తదితర సేవలను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే iGram లక్ష్యమని సంస్థ తెలిపింది.
సంస్థలో “iGram Mitras” కీలక పాత్ర పోషిస్తున్నారు. స్థానిక యువతను డిజిటల్ సేవలతో అనుసంధానిస్తూ గ్రామాల్లోనే ఉపాధి, వ్యాపార అవకాశాలను పెంచడం వారి ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంది.
iGram Digihub డైరెక్టర్లుగా అదితి మహేంద్ర రౌత్, బానోతు పద్మ, వెంకటేశ్వర్లు మైపతి వ్యవహరిస్తుండగా, మహేంద్ర బి. రౌత్, డా. బానోతు సంజయ్ నాయక్ సలహాదారులుగా ఉన్నారు.
“గ్రామంలో సేవలు – గ్రామంలోనే అవకాశాలు – గ్రామం నుంచే అభివృద్ధి” అనే లక్ష్యంతో ప్రతి గ్రామాన్ని డిజిటల్ అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ఉద్దేశ్యమని iGram Digihub వెల్లడించింది.


