Wed. Sep 23rd, 2026

J365 న్యూస్, కొత్తగూడెం : ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ కౌన్సిల్ పిలుపు మేరకు మేరకు 23-09-2026 న బుధవారం ఐలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల డెత్ /రిటైర్మెంట్ బెనిఫిట్ రు.25,00,000/- లకు పెంచాలని, న్యాయ వాదులందరికీ వైద్య సహాయం క్రింద రు.5,00,000/- మరియు జూనియర్ న్యాయవాదులకు నెలకు రు.10,000/- స్టైఫండ్ గా 5 సంవత్సరాల వరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఐలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కిలారుపురుషోత్తమరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ( ఐలు )అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ ప్రసంగీస్తూ సమాజంలో వివిధ వృత్తిలో పని చేస్తున్న వారు వారి మరణానoతరం వచ్చే ప్రయోజనాలతో పోలిస్తే మన న్యాయవాదులు అందుకునే పది లక్షల సహాయం సరిపోదని అట్టి సహాయాన్ని ఇరవై ఐదు లక్షలు ఇవ్వడానికి డిమాండ్ చేయడం సమంజసం అని, అదే విధంగా న్యాయవాదుల ఆరోగ్య భీమా రెండు లక్షల ఇవ్వడం అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు రెండు లక్షలు సరిపోవని ఆరోగ్య భీమాను ఐదు లక్షలు గా పెంచవలసిన అవసరం ఉందని అదేవిధంగా, జూనియర్ న్యాయవాదులు వచ్చిన కొత్తలో వారికి కేసులు రావడం కష్టంగా ఉంటుంది వారికి ప్రతి రోజు ఉండే ఖర్చులకు చాలా ఇబ్బంది పడుతుంటారు. కావున వారికి నెలవారీ వేతనంగా కనీసం పది వేలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని ఈ మూడు డిమాండ్ లు అమలు చేయడానికి బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా కేంద్ర న్యాయవాదుల సంక్షేమ నిధి నుంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐలు జాతీయ స్థాయిలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు . అదే విధంగా ఐలు జాతీయ కౌన్సెల్ మెంబర్ జలసూత్రం శివరాం ప్రసాద్, ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ కుమార్ మక్కడ్, న్యాయవాదుల డిమాండ్స్ గురించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ఐలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులు ఎం. వీ. ప్రసాదరావు, జిల్లా అధ్యక్షులు పి. కిషన్ రావు, కె. పుల్లయ్య, ఆర్. రామారావు, బి.అరుణ్ చంద్, జి. కె.అన్నపూర్ణ, ఎస్. వెంకట నర్సయ్య, టి. రమేష్, యు.అరుణ్, ఏ. రవి కుమార్, డి.రవి కుమార్, పి.రామారావు, పి. రవి వర్మ, పగిడిపల్లి రవి, కె. అభిలాష్, ఎస్.రామారావు, బి.రమేష్, లీలావతి, హిమబిందు లు పాల్గొన్నారు. అదేవిధంగా మణుగూరు కోర్ట్ కమిటీ అధ్యక్షులు పి.భాస్కర్, ఎం. శ్రీనివాసరావు, పి. నగేష్ కుమార్, జే. చొక్కారావు , ఈ.రాము పాల్గొన్నారు. అదే విధంగా భద్రాచలం కోర్ట్ కమిటీ సభ్యులు కె. శ్రీనివాసరావు, ఏ. అంజలి కుమారి, యు. గౌతమ్ కుమార్ పాల్గొన్నారు. ఇల్లందు కోర్ట్ కమిటీ సభ్యులు సత్యనారాయణ పాల్గొన్నారు. కొత్తగూడెం జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ ముదుల్కర్ , ప్రధాన కార్యదర్శి జి. మహేశ్వరరావు ఐలు డిమాండ్స్ గురించి ప్రసంగించి వారికి మద్దతు తెలిపారు. సీనియర్ న్యాయవాదులు ఎల్. సత్యనారాయణ, వి. నాగి రెడ్డి, జి.రామమూర్తి, కె. నాగేశ్వరరావు, ఎమ్. ఉషారాణి ఐలు డిమాండ్స్ గురించి ప్రసంగించి మద్దతు తెలిపారు, ఐ.ఏ.ఎల్. భాద్యులు వై. ఉదయ్ భాస్కర్, భాగం మాధవరావు, ఐలు డిమాండ్స్ గురించి ప్రసంగించి తమ యొక్క మద్దతు తెలిపారు. న్యాయవాద పరిషద్ భాద్యులు పీ.ఆర్. విఠల్ ఐలు డిమాండ్స్ గురించి ప్రసంగించి వారి మద్దతు తెలిపారు. బి.జె.పి. లీగల్ కౌన్సెల్ కాసాని రమేష్ ప్రసంగించి ఐలు కి మద్దతు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ సీనియర్ మరియు జూనియర్ మరియు మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారికి పేరుపేరున ధన్యవాదాలు. అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన న్యాయవాదులందిరికీ పేరుపేరున కృతజ్ఞతలు.

Share this post...