-త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని మాట ఇచ్చిన అడ్లూరి
J365న్యూస్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం తాళ్లకొత్తపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాయిని తిరుపతి ఆధ్వర్యంలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని పలువురు స్థానికులతో మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ సమస్యలు పై చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద గల గటేరు పూర్తిస్థాయిలో నిండి మురికి నీరు నిలుస్తూ ఆ నీళ్ళద్వారా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ కారణంగా వర్షాకాలంలో పరిస్థితి చాలా దయనీయంగా మారుతుందని. చెగ్యాం, తాళ్లకొత్తపేట గ్రామాల రైతులకి సంబంధించిన కెనాల్ రోడ్డు పరిస్థితి ల పై దృష్టి సారించి. ఈ సమస్యలపై పరిష్కారం చూపాలని లక్ష్మణ్ కుమార్ ను కోరగా. ఆ యా శాఖల అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడి సమస్య పరిష్కారానికి త్వరలో మార్గం చూపుతానన్ని మాట ఇచ్చినట్లు వారి తెలిపారు.
