మద్యం ప్రియులకు అడ్డాగా మారిన సంత మార్కెట్
అశ్వరావుపేట j365 న్యూస్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మేజర్ పంచాయతీ సంత మార్కెట్లో సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న నియోజకవర్గ ప్రజలు వారపు సంతకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితికి ఏర్పడింది ఎటు చూసినా అపరిశుభ్రత వాతావరణం దుర్గంధంతో కూడిన వాసన బురద మురికితో పరిసరాలు అంతా చెత్తతో నిండిపోయి ఉంది ఇదే అదునుగా కొందరు చెత్తా చెదారాన్ని సంత మార్కెట్లోకి విసురుతున్నారు. సుమారుగా మండలంలో ప్రతి గ్రామం నుంచి సంత మార్కెట్ కి ప్రతి బుధవారం వస్తువులు కూరగాయలు కొనుగోలు కొరకు వస్తారు రద్దీగా ఉండే జనావాసాల మధ్య చెత్తాచెదారం నిండిన పట్టించుకునే సిబ్బంది కరువైంది సంచార జీవులు పొట్టకూటికోసం వచ్చి బుధవారం మినహా మిగతా రోజుల్లో నివాసం ఉండి వెళ్ళిపోతారు వేరే కాక వృద్ధులు అనాధలకి మతిస్థిమితం లేని వారికి ఎందరికో నీడలాగా ఉండే సంత మార్కెట్ అపరిశుభ్రత నిర్లక్ష్యం విలయ తాండవం చేస్తున్నాయి. సంత రూపం లో వచ్చే ఆదాయం మీద ఉన్న శ్రద్ధ పారిశుద్ధ్య పనుల మీద చర్యలు తీసుకునే అధికారం పంచాయతీ సిబ్బందికి లేకపోవడం గమనార్హం అలాగే వారాంతపు సంత నిర్వహించే దుకాణదారులకి సరైన నీటి సదుపాయం కానీ మరుగుదొడ్లు సదుపాయం కానీ లేకపోవడం తో దుకాణదారులు కానీ వారాంతపు సంతకు వచ్చే ప్రజలు గాని చాలా ఇబ్బందిగా గురవుతున్నారు పంచాయతీ సిబ్బంది వారు ఇకనైనా గమనించి మురికి కాలువ లేకుండా పిచ్చి చెట్లు తీసివేసి ఆ వాతావరణం సుందరీ కారణంగా తీర్చిదిద్ది ఎక్కువమంది మార్కెట్ కు వచ్చే విధంగా చూడాలని మార్కెట్ అంతా అపరిశుద్ధత వాతావరణం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నాను పంచాయతి అధికారులు తక్షణం స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
