Thu. Jan 29th, 2026

J365 న్యూస్ : కేంద్ర బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రజా కార్మిక రైతు సంఘాల పిలుపులో భాగంగా ఫిబ్రవరి 16న జరుగు గ్రామీణ భారత్ బంద్ లో ప్రజలు పాల్గొని జిల్లా బంద్ ను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం కోరారు. సిపిఎం కొణిజర్ల మండల కమిటీ విస్తృత సమావేశం లక్ష్మి పురం గ్రామంలో సోమవారం చింతపల్లి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ సంక్షోభానికి కారణం అయిన బిజెపీ ప్రభుత్వం, కార్మికులకు ఉన్న హక్కులను తొలగించి పని గంటలు పెంచి పనికి తగ్గ వేతనాలు ఇవ్వకుండా ప్రజల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. గ్రామీణ భారత బంద్ సందర్భంగా ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే బాధ్యత ప్రతి ప్రజా సంఘాలు , కమ్యూనిస్టు కార్యకర్తపై ఉందని ఆయన తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ పార్టీ కార్పొరేట్ అనుకూల విధానాల అనుసరిస్తున్న బిజెపిని గదే దించడమే లక్ష్యంగా ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. 16న వామపక్ష, ప్రతిపక్ష పార్టీలు, కార్మిక ,రైతు సంఘాల ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన బంద్ తో పాటు మండల కేంద్రంలో జరుగు ర్యాలీ ప్రదర్శన బంద్ ను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు, మండల నాయకులు కొప్పుల కృష్ణయ్య కట్టా రాంబాబు తాళ్లపల్లి విజయ, తాత పద్మ, బానోతు హరిచంద్ , ధరావత్ నంధ్యా నాయక్, షేక్ మహబూబ్ అలీ, దుగ్గినేని అజయ్ కుమార్, ఎస్ కె సైదా, పంచాక్షరి రామయ్య తాత నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share this post...