భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజక వర్గం దమ్మపేట మండలంలోని కొత్త చీపురిగూడెం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం పొట్ట ప్రసాద్ ఇల్లు పూర్తిగా కాలిపోయి దగ్ధం అయినది.పంట సాగుకు ఉపయోగ పడే ఎరువుల బస్తాలు పూర్తిగా కాలి పోయాయి,అతని వంట సామాగ్రి పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అనుచరులు పర్వతనేని ప్రసాద్ ,ముళ్ళపూడి వెంకటేశ్వరరావు ఈ విషయాన్ని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దృష్టికి తీసుకువెళ్లి ఇందిరమ్మ ఇల్లు వచ్చేటప్పుడు తొలి లిస్టులో మీకు వచ్చేటట్టు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మాట్లాడుతానని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పూణెం వెంకటేశ్వరరావు సుగాని శ్రీధర్ బాలరాజు గూడెం మాజీ సర్పంచ్ శ్రీను అశ్వరావుపేట నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ పాషా,శ్రీధర శ్రీను,కొండ పరామర్శించి నిత్యావసరాలకు ఆర్ధిక సాయం అందించటం జరిగింది.
