ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఎం.వి. రావు మాతృమూర్తి కారేపల్లి మండలం కొత్త కమలాపురంలోని ఇటీవల స్వర్గస్తులైనారు.ఈ నేపధ్యంలో లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీ పంచాయతీ ఉప సర్పంచ్,సామాజిక వేత్త,లగడపాటి రమేష్ చంద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.కార్యక్రమంలో డాక్టర్ ఎంవీ రావు,కోట అప్పారావు తదితరులు ఉన్నారు.
