Thu. Jan 29th, 2026

J365 న్యూస్ :  కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి వేడుకలు

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయస్థానం ప్రాంగణంలోని కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లైబ్రరీ హాల్ నందు సంత్ గురువు శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ కుమార్ మక్కడ్ గారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘ సంస్కర్త అని, లంబాడీలు తండాల స్థిర నివాస ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తి అని, అహింసా మార్గం బోధించారని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎన్నో హిత బోధలు చేశారని లంబాడీలు అధ్య దైవంగా సేవాలాల్ మహారాజ్ నీ కొలుస్తారని, నేటికీ గిరిజన లంబాడీలు వారిని స్మరించుకోవడం ఆయన గొప్పతనాన్ని సూచిస్తుంది అనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ కుమార్ మక్కడ్, జనరల్ సెక్రెటరీ రావిలాల రామారావు, సంయుక్త కార్యదర్శి కాసాని రమేష్, క్రీడా కార్యదర్శి పిట్టల రామారావు, న్యాయవాదులు రవి కుమార్ నాయక్, బానోత్ రమేష్ నాయక్, ప్రసాద్, లావుడ్య రమేష్ నాయక్ కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Share this post...