J365 NEWS ::
2024 ఆసియా లోనే అతి పెద్ద గిరిజన మేడారం జాతర ఘనంగా జరిగింది.. జాతరను పురస్కరించుకొని పెద్ద మేడారం తో పాటు మినీ మేడారం జాతరకు కూడా భక్తులు కొలువు తీరారు…
మినీ మేడారంలో బాగంగా తోగూడెం శ్రీ సమ్మక – సారక్క గుడి గడచిన వారం రోజులు భక్తులతో రద్దీగా మారింది… భక్తులు సమ్మక్క – సారక్క లని దర్శించుకోవడానికి తమ మొక్కులను అర్పించుకొదనికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు..
ఈ మినీ మేడారం జాతరలో భక్తులతో పాటు స్థానిక రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు… పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు కూడా పాల్గొని వారి అర్పనలు అర్పించారు…
గడచిన వారం నుండి రద్దీ గా మారిన మినీ మేడారం తెలంగాణ ప్రభుత్వం 22; 23 తేదీలలో సెలవలు ప్రకటించడంతో ; భక్తులు తమ సొంత ఊరికి చేరుకొని మినీ మేడారంలో జాతరలో పాల్గొన్నారు…
ఇటు జాతరతో పాటు మినీ మేడారం అంత ఎగ్జిబిషన్ మరియు పిల్లల ఆటలతో నిండిపోయింది… జాతరకు ఎగ్జిబిషన్ మరొక అందాన్ని తెచ్చి పెట్టింది… భక్తులు ఇటు జాతర చూసుకొని అటు ఎగ్జిబిషన్ లో వున్న జాయింట్ వీల్; బ్రేక్ డాన్స్; కొలంబస్; మరియు చిన్న పిల్లల ఆటలను ఆనందించారు…
ఎటువంటి మత విభేదాలు లేకుండా అన్ని మతాలవారు అన్ని వయసుల వారు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు…

