Thu. Jan 29th, 2026

J365 న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మార్కెట్ ఏరియాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్టార్ చిల్డ్రన్ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ ను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి మరియు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శ్రీ మద్దినేని పాపారావు సోమవారం నాడు సందర్శించినారు. స్టడీ సెంటర్ కు చెందిన పలు రికార్డులను పరిశీలించినారు.అనంతరం పిసీపీ క్లాసుల నిర్వహణను గురించి ఏఐ కోఆర్డినేటర్ ను అడిగి తెలుసుకున్నారు. రెగ్యులర్ విద్యను అభ్యసించుటకు అవకాశం లేని వారు ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను అభ్యసించి బంగారు భవిష్యత్ పొందవచ్చునని, జీవితంలో స్థిర పడవచ్చని తెలియజేసినారు.ఓపెన్ విద్యను అభ్యసించిన వారికి, రెగ్యులర్ విధానములో విద్యను అభ్యసించిన వారితో సమానంగా ఉపాధి అవకాశములు కలవని, ఉన్నత విద్యను కూడా అభ్యసించ వచ్చని పేర్కొన్నారు. మార్చి 31వ తేదీ వరకు సెలవు దినములలో పిసిపి క్లాసులు నిర్వహించ బడతాయని అభ్యాసకులు ఈ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని,ప్రణాళికబద్ధంగా చదివి పరీక్షలలో ఉత్తమఫలితాలు సాధించాలని అభ్యాసకులను కోరినారు. అనంతరం శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్ లో జిల్లా రెండవ ర్యాంకు సాధించిన గుమ్మల్ల జయ లేఖను ఇరువురు అభినందించినారు ఈకార్యక్రమంలో స్టడీ సెంటర్ ఏఐ కోఆర్డినేటర్ జి భాస్కరరావు, అసిస్టెంట్ కోఆర్డినేటర్ జి శ్రీనివాస్ రెడ్డి, పి. పుష్పలత, రమాదేవి, స్వరూప,మహేశ్వరి,మౌనిక, ప్రశాంతి పాల్గొన్నారు.

Share this post...