Tue. Feb 3rd, 2026

భద్రాద్రి కొత్తగూడెం(J365 న్యూస్ ) : నా భారతదేశంలో విద్య, వైద్యం సరైన రీతిలో అందడం లేదని,సామాన్యుడు వీటిని కొనుక్కోవాల్సిన దుస్థితి దాపురించి ఆర్థిక భారంతో నలిగిపోతున్నారు.ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు ఇవి ఉచితంగా అందించడమే కాకుండా ప్రభుత్వానికి ప్రజల గొంతుకై చట్టసభలో వినిపిస్తానని,అవసరం అయితే న్యాయస్థానాల ద్వారా ఒక న్యాయవాదిగా వీటిని ఉచితంగా అందించేందుకు శక్తిమేరకు శ్రమిస్తానని అంటున్నారు ప్రముఖ న్యాయవాది, ఐక్యరాజ్యసమితిలో నిరుపేదల వాణి వినిపించిన ఖమ్మం పార్లమెంట్‌ స్వతంత్ర జోగ్రాం నాయక్ . మే 13న జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. దీనిలో భాగంగా ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలోని పాలేరు, మధిర, ఖమ్మం, సత్తుపల్లి, వైరా, అశ్వారావుపేట, కొత్తగూడెం ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతూ చట్టం న్యాయం విద్య వైద్యం రాజ్యాంగం పై అవగాహన ఉన్న పదునైన మాటలతో ప్రసంగాలు చేస్తూ ప్రజలను ఆలోచింపచేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్‌ ఇస్తే రైతులకు మద్దతు ధర, ప్రభుత్వ ఉద్యోగాల్లో దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు, కాంట్రాక్ట్‌ ఉద్యోగాలకు వేతనాలు, మూతబడ్డ పరిశ్రమలు పునరుద్దరణ కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రజల కష్టాలను న్యాయవాదిగా కండ్లారా చూశానని, ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించే వారికి అవకాశం ఇవ్వాలని, ప్రజాస్వామ్యంలో కల్పించిన ఓటు హక్కును అమ్ముకోకుండా దేశ భవిష్యత్తును నిర్ణయించేగా ఉండాలని, అందుకు సరైన వారికి ఓటు వేయాలని, ఉన్నత విద్యావంతుడిగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. హైకోర్టు, సుప్రీం కోర్టులో అనునిత్యం ప్రజల సమస్యలు.. కష్టాలను కండ్లారా చూస్తూ.. సమస్యలను పరిష్కరిస్తూ వచ్చానని.

నిరక్ష్యరాస్యత మూలంగా పడుతున్న ఇబ్బందులు.. అనారోగ్య సమస్యలు వస్తే వాటిని నయం చేసుకోవడానికి అనుభవిస్తున్న బాధలను చూసి చలించిపోయేడినని జోగ్రాం నాయక్ తెలిపారు. ఈ బాధల నుంచి నిరుపేద ప్రజలను బయటపడేయాలంటే ఒక్క రాజకీయాల ద్వారానే సాధ్యమని, *ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈ సారి పోటీలో నిలబోతున్నానని, ప్రజలు ఆశీర్వదించి ఒక్క అవకాశం కల్పించాలని కోరారు.

Share this post...