Mon. Feb 2nd, 2026

–జగన్ ప్రభుత్వం పై తెలుగు శక్తి దండయాత్ర

–175 కి 175 స్థానాలు జనసేన – టిడిపి – బిజెపి కూటమి విజయం సాధించడం ఖాయం

–రూ.13.50 లక్షల కోట్లకు లెక్క చెప్పు జగన్

— తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్

J365 న్యూస్,  విశాఖపట్నం : దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతిని పునర్నిర్మిస్తామని అమిత్ షా ప్రకటన పై తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ హర్షం వ్యక్తం చేశారు. గడచిన 5 సంవత్సరాలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ప్రశ్నించారు. కేవలం విధ్వంసం, అరాచకాలు, బలవంతపు అరెస్టులు, యదేచ్చగా మానవ హక్కులకు ఉల్లంఘన రాష్ట్రంలో కొనసాగుతున్నాయన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గడచిన 5 సంవత్సరాలలో 13.50 లక్షల కోట్ల రూపాయలను అప్పులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్పుల కుప్పగా మార్చి వేశారన్నారు. అప్పుగా తీసుకువచ్చిన 13.50 లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు చేశారో చెప్పాల్సిన బాధ్యత ( అకౌంటబిలిటీ ) రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఉందన్నారు. మరోవైపు రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయన్నారు. మితిమీరిన దుర్మార్గ పాలనకు పరాకాష్ట.. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా వైయస్ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 175 కి 175 స్థానాలు జనసేన – టిడిపి – బిజెపి కూటమి విజయం సాధించడం ఖాయం అని రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Share this post...