-ఖమ్మం జిల్లాలో బిజెపి జెండా ఎగరడం ఖాయం.
-మోడీని మూడోసారి ప్రధాని చేస్తాం.
-తాండ్ర వినోద్ రావు గెలుపు తథ్యం.
J365న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం పట్టణంలోని 11వ వార్డు నుంచి బిజెపి పార్టీ నాయకులు బానోత్ రాంబాబు నాయక్ ఆధ్వర్యంలో యువకులు మహిళలు యువత సుమారు 100 మంది కార్యకర్తలు బీజేపీ నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జిల్లా అధ్యక్షులు జీవీకే మనోహర్ సమక్షంలో బీజేపీ పార్టీలో కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా జీవీకే మనోహర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి చేస్తున్న సేవలను పేద పడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావునీ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు బిజెపి పార్టీ పెద్దపీట వేస్తుందని ఉద్యమకారులంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీనీ వదిలి బిజెపి పార్టీలో చేరాలన్నారు దేశ రక్షణ మోడీతోనే సాధ్యమని బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలుపునకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ప్రపంచ దేశాలలో భారతవాణిని అగ్రగామిగా నిలుపుకోవడం కోసం భారతదేశంలో సుస్థిర శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం అన్నారు దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ లాంటి వ్యక్తులు ప్రధానిగా ఉండడం ఎంతో అవసరం అన్నారు తాండ్ర వినోద్‌రావు లాంటి వ్యక్తులను పార్లమెంటుకు పంపిస్తే మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని మోడీ నాయకత్వంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు దేశంలో మరోసారి మోడీ గెలుపు ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు నరేంద్రబాబు బానోతు హనుమంతు నాయక్ టాకు నాయక్ భీముడు నాయక్ వెంకటయ్య నాయక్ బానోత్ మంగి బానోత్ బురు నాయక్ శ్రీనివాస్ నాయక్ బానోత్ కిషన్ నాయక్ కమల సునీత అజ్మీరా నేతాజీ భూక్యా రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు
