J365న్యూస్: డోర్నకల్ నియోజక వర్గం సిరోల్ మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన లంబాడీల ఐక్యవేదిక లైవ్ అసెంబ్లీ సెక్రటరీ గా తేజావత్ రాంమూర్తి నాయక్ నియమితులయ్యారు.లంబాడీల ఐక్యవేదిక జాయింట్ సెక్రెటరీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ జాదవ్,చీప్ కోఆర్డినేటర్ రమేష్ నాయక్ లు,లంబాడీల ఐక్యవేదిక లైవ్ అసెంబ్లీ సెక్రటరీగా నియకమకమైన తేజావత్ రాంమూర్తి నాయక్ కు నియామక పత్రం అందజేశారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు,స్నేహితులు, బంధువులు,తోటి సహచరులు కుటుంబసభ్యులు తేజావత్ రాంమూర్తి నాయక్ కి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం తేజావత్ రాంమూర్తి నాయక్ మాట్లాడుతూ తనను నియమించిన రాజ్ కుమార్ జాదవ్ రమేష్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. లంబాడీలు విద్య,వైద్య,ఉద్యోగం రాజకీయ ఇతర అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,యువతను ప్రగతి చైతన్యం చేయడానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు.
