Tue. Mar 24th, 2026

J365న్యూస్, మహబూబాబాద్ జిల్లా: ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేయాలన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి, సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు, ఎంపీఓలతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల సర్వే లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సర్వే ఇంటింటి కి వెళ్లి మొబైల్ యాప్ ద్వారా నమోదు చేస్తున్న వివారాలు సంబంధిత డాక్యుమెంట్ల ను సేకరించి మొబైల్ యాప్ ద్వారా అడుగుతున్న ఆన్ని కాలమ్స్ కరెక్టుగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా జిల్లాలో వచ్చిన దరఖాస్తులు ప్రజాపాలన పెట్టుకోవడం జరిగిందన్నారు.ఈ సర్వేను ప్రభుత్వం సూచించిన గడువులోగా పూర్తి చేయాలని, సర్వే చేసే సర్వేయర్ లు ఎలాంటి పొరపాట్లు జరగకుండా సర్వే చేయాలని, సర్వే చేసేటప్పుడు ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోవాలని, ఇందిరమ్మ కమిటి సభ్యులు తప్పకుండా ఈ సర్వేలో పాల్గొనాలని, సర్వేకు సంబంధించిన ప్రతి అవసరం ఉన్న డాక్యుమెంట్లను ఇంటి సభ్యులు చూపించి సర్వే సాఫీగా జరిగేందుకు సహకరించాలని ఆన్నారు. అలాగే మున్సిపాలిటీల్లో కూడా ఈ సర్వే పూర్తి చేయాలనీ ఆదేశించారు. సర్వే అనంతరం శాతం ఎంపీడీవో లు మున్సిపల్ కమిషనర్ లు సూపర్ చెక్ చేయాలని, సర్వేలో పేరు , వివరాలు, ఫొటో , తదితర వివరాలు సరిగా ఉందా లేదా చెక్ చేసిన తరువాత ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరుగుతుందని, ప్రభుత్వం ఆదేశాల మేరకు అర్హులు ఎంత మంది ఉన్నారో పూర్తి వివరాలు సేకరించాలన్నారు. ఇందిరమ్మ కమిటీ పంచాయతీ సెక్రటరీలు గడువులోగా సర్వే పూర్తి చేయాలనీ ఆన్నారు.

ఇప్పటి వరకు ఎన్ని నమోదు చేశారని అడిగి తెలుసుకొని, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, తొందరపాటుగా కాకుండా జాగ్రత్తగా తప్పులు జరుగకుండా నమోదు చేయాలని, మోబైల్ యాప్ లో నమోదుచేసేటప్పుడు , ఏమైనా సమస్యలు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ సమావేశంలో జడ్పీ సీఈవో పురుషోత్తం, హౌజింగ్ డి.ఈ రాజయ్య, మహబూబాబాద్,డోర్నకల్, మరిపెడ మున్సిపల్ కమిషనర్లు రవీందర్, వెంకటస్వామి, నరేష్ రెడ్డి, సూపర్డెంట్ నారాయణమూర్తి, ఈ డిస్టిక్ మేనేజర్ ప్రశాంత్, ఎంపీడీవో లు,ఎంపీవోలు,తదితరులు పాల్గొన్నారు.

 

Share this post...