J365న్యూస్, మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మార్వో సెంటర్ లో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జనవరి 5న మానుకోటలో జరిగే సభను విజయవంతం చేయాలని కరపత్ర ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ అధ్యక్షతన జరిగే సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన లంబాడీల సమస్యలు మరియు హక్కుల సాధనకై సభ జరుగుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లంబాడీల మాతృభాషా అయిన బోర్ బోలిను గుర్తించి రాజ్యాంగం లోని ఎనిమిదవ షెడ్యూల్ లో చేర్చాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన లంబాడి ల ఓట్ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి.
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు – సామాజిక న్యాయం తో పాటు క్రీమీలేయర్ తో రిజర్వేషన్లను జీరో చేసే కుట్ర పై పోరాటం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణలో క్రిమి లేయర్ ను తొలగించాలి. కేంద్ర ప్రభుత్వం సమగ్రమైన కులగణన చేపట్టి శాస్త్రీయమైన ఫలాల పంపిణీ చేయాలి. రాజ్యాంగ వ్యతిరేకమైన అగ్రవర్ణ ఈడబ్ల్యూఎస్ అనుబంధంగా ఉన్న జీవో నెంబర్ 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు లాభనష్టాలపై చర్చ. గిరిజనులకు జనాభా తమాషా ప్రకారం రాష్ట్రంలో 12 శాతం కేంద్రంలో 14 శాతం వరకు రిజర్వేషన్ పెంచి రాజ్యాంగం లోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ చట్టాలను 100% పకడ్బందీగా అమలు చేయాలి. తండాలు గూడాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలి. ఎస్టీల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేసి గిరిజనుల అభివృద్ధి కోసమే ఉపయోగించాలి. ట్రై కార్ నిధులను మరియు ఎస్టీ కార్పొరేషన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల గా గుర్తించాలి.
రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ విషయంలో ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వమే నేరుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో మైదాన ప్రాంత ఐటీడీలను ఏర్పాటు చేయాలి. అతిపెద్ద గిరిజన జిల్లా అయినా మహబూబాబాద్ లో గిరిజన మ్యూజియంను ఏర్పాటు చేయాలి. గిరిజనుల వేషధారణ సాంప్రదాయం హస్తకళ నైపుణ్యం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి ఔత్సాహికులను ప్రోత్సహించాలి. గురుకుల పాఠశాలలో ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాలలో చదువుకునే విద్యార్థులకు అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త రెవిన్యూ చట్టంలో గిరిజనులకు సంబంధించిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలి. గిరిజనుల భూములు కబ్జాకు గురి కాకుండా రక్షణ కల్పించాలి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎం లను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి. మొదలైనటువంటి గిరిజనుల హక్కుల సాధనకై లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జాతీయ బంజారా మిషన్మరియు గిరిజన సామాజిక చైతన్య వేదిక ఐక్య సంఘాలతో జనవరి 5న మానుకోటలో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూక్య శ్రీను నాయక్, బాదావత్ బిక్షం నాయక్, ధారావత్ హాథిరాం నాయక్, ధరావత్ రమేష్ నాయక్, రాజేందర్ నాయక్, మునేష్ నాయక్, రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు

