Tue. Mar 24th, 2026

భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశ ప్రజలకు తీరని లోటని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. విద్యానగర్ లోని మంత్రి పొంగులేటి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాన మంత్రి ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ సంతాప సభఃలో పాల్గొని ఆయన వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.మన్మోహన్ సింగ్ గారి లాంటి గొప్ప వ్యక్తి మన మద్య లేకపోవడం బాధాకరం అన్నారు. భౌతికంగా వారు మనకు దూరమైన, ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు,చట్టాల రూపంలో భారతదేశ అభివృద్ధిలో సజీవంగా ఉంటాయాన్నారు. ప్రధాని పీవీ నరసింహారావు గారి నేతృత్వంలో ఆర్థిక మంత్రిగా గొప్ప ప్రణాళికలను రచించి, వాటిని అమలుచేసి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించారని కొనియాడారు.ప్రధానమంత్రిగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగేంద్ర త్రివేది,కౌన్సిలర్ వై శ్రీనివాస్ రెడ్డి, సుజాతనగర్ మండల అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్,కార్పొరేట్ ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ పితాంబరం,కాంగ్రెస్ నాయకులు బాలిశెట్టి సుందర్ రాజ్, క్లాసిక్ బ్యాండ్ రమణ,సుందర్ లాల్ కోరి,బాల పాసి,దాసోజు కనకరాజు,కున్సోత్ కిషన్,మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా, ఓబీసీ సుజాతనగర్ మండల అధ్యక్షులు కసబోయిన. లక్ష్మణ్,వెంకట్ యాదవ్,మధుసూదన్ (చిన్ని) రవి,జానీభాయ్, అక్బర్,నాగేశ్వరావు,గణేష్,రామకృష్ణ,జల్లి కిరణ్,కుమార్,శ్రీకాంత్ నాగార్జున్,రాజేంద్ర ప్రసాద్,చందూ తదితరులు పాల్గొన్నారు.

Share this post...