Tue. Mar 24th, 2026

  • కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల జీవితాలు అంధకారం…
  • చాలీచాలని జీతంతో జీవితం విల విల…
  • పలు సమస్యలపై నిరవదిక సమ్మెబాట…

J365 NEWS,  భద్రాచలం: తెలంగాణ రాష్ట్రంలోని ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తమ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా 12 రోజుల పాటు నిరవధిక సమ్మె చేపట్టనున్నారు.
వారి యొక్క ప్రధాన డిమాండ్లు
1.కాంట్రాక్ట్ టీచర్ల నియంత్రణ.
2. కనీస సమయ ప్రమాణాన్ని ఇవ్వడం.
3. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 1వ తేదీన జీతాల చెల్లింపు.
4. 61 ఏళ్లపాటు ఉద్యోగ భద్రత కల్పించడం.
5.61 వీటిని పూర్తి చేసిన సి.ఆర్.టిలందరికీ పదవీ విరమణ సహకారం రూ.20లక్షలు అందించాలీ. 6. అందరికీ హెల్త్ కార్డ్ సౌకర్యం కల్పించాలి.
7. మహిళా సి.ఆర్.టిలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను అందించడం.

ఈ డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టాలని రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చినట్లు తెలిపారు. సీఆర్టీ సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శివనాయక్ మాట్లాడుతూ… రెండు అంశాలపై పోరాడుతున్నామన్నారు.

1. కాంట్రాక్ట్ టీచర్ల క్రమబద్ధీకరణ విషయంలో పైన పేర్కొన్న అంశాలన్నీ వర్తిస్తాయి.

2. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల1వ తేదీన జీతం చెల్లించడం కనీస సమయ ప్రమాణం. మన రాష్ట్రంలో ముఖ్యమైన మంత్రి పదవులు మన జిల్లాకు చెందినవే. మా సమస్యలను వారితో పంచుకుంటే సానుకూలంగా హామీ ఇవ్వాలని, లేనిపక్షంలో మరోమారు నిరాహార దీక్షలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరవధిక సమ్మె బాటలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు శ్రీను, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సక్రాం, ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి రవికుమార్, వీరన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబూరావు, రూప్లా, లక్ష్మణ్, సురేష్, భావసింగ్, మంగీలాల్, శంకర్, రమాదేవి, జ్యోతి, తార, తదితరులు పాల్గొన్నారు.

Share this post...