…జిల్లా కోర్టు ప్రాంగణంలో సమావేశం
…అవకాశాన్ని వినియోగించుకోవాలని జడ్జి సురేష్ సూచన
J365 న్యూస్, మహబూబాబాద్ జిల్లా: ప్రతి రెండు నెలలకు ఒకసారి సీనియర్ సివిల్ జడ్జి మరియు సెక్రటరీ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ, మహబూబాబాద్ కన్వీనర్ గా, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్లు మహబూబాబాద్, తొర్రూరు మరియు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మెంబర్లుగా ఉండే ఈ కమిటీ కన్వీనర్ అధ్యక్షతన సమావేశమై హిట్ అండ్ రన్ కేసుల విషయంలో పురోగతి గురించి చర్చించి తగు నివేదికను హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి పంపబడును ఈ సందర్బంగా జడ్జి సురేష్ మాట్లాడుతూ ఈ విదంగా తెలియజేయడం జరిగింది.రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్లు మహబూబాబాద్ మరియు తొర్రూరు వారు మరియు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్లు మెంబర్లుగా ఉన్నాయి కమిటీ ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమై కన్వీనర్ సమావేశమై హిట్ అండ్ రన్ కేసుల విషయంలో ప్రోగతి గురించి చర్చించి తగు నివేదికను హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి పంపబడును.
హిట్ అండ్ రన్ కేసులు అంటే గుర్తుతెలియని వాహనాలు తగిలి చనిపోయిన వ్యక్తులు సంబంధీకులు పోలీవారిని సంప్రదిస్తే వారు ప్రధమ సమాచార నివేదికతోపాటు బాధితుని వివరాలను రెవెన్యూ డివిజన్ అధికారులకు పంపిస్తే, వారు రెండునెలలకు ఒకసారి జరిగే సమావేశంలో చర్చించి పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్ కు పంపిస్తే వారు పరిశీలించి బాధితుని తరుపు వారికి కేంద్ర ప్రభుత్వం తరుపున వచ్చే 2లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించబడును. బాధితుల తరుపు బంధువులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ విషయంపై అవగాహన ఉన్నవారు ఇతరులలో చైతన్యం కల్పించాల్సిందిగా జడ్జి చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి తిరుపతిరావు, మహబూబాబాద్ మరియు తొర్రూరు రెవెనుడివిజినల్ కార్యాలయ అధికారులుపాల్గొన్నారు.

