J365 న్యూస్ :మిర్యాలగూడ:
భారత చైతన్య యువజన పార్టీ (BCYP) తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని, రాబోయే కుల జనగణన డేటా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేసింది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు అయినా ఇప్పటి వరకు ఎస్సి, ఎస్టీ మరియు బీసీలు సామాజికంగా,ఆర్థికంగా మరియు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని, వారి సాధికారత కోసం రిజర్వేషన్స్ పెంచాలని బీసీవై పార్టీ ఇంచార్జి బొడ్డు వెంకన్న యాదవ్ సీఎం రేవంత్ రెడ్డి కి లేఖ రాసారు. ఈ వర్గాలు రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా నిలిచాయని, వారి జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్ విధానాలను పెంచడం ద్వారా సమానత్వం, సామాజిక న్యాయం, మరియు సమగ్ర అభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది అని తెలిపారు. కుల గణన డేటా విడుదల సందర్భంగా ప్రభుత్వం ప్రజా నిబద్ధత ప్రకటించి, రిజర్వేషన్స్ పెంచుటకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి చట్ట సవరణలు చేపట్టాలని డిమాండ్ చేసారు. అంతేగాక, రిజర్వేషన్ల పెంపు నిర్ణయం సామాజిక న్యాయంలో తెలంగాణను దేశానికి మార్గనిర్దేశకంగా నిలబెడుతుందని బొడ్డు వెంకన్న యాదవ్ తెలిపారు.

