J365 న్యూస్ కొత్తగూడెం
పర్యావరణ పరిరక్షణకై తన వంతు బాధ్యతగా గత రెండు సంవత్సరాలుగా ప్రతిరోజు మొక్కలు నాటుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిరంజీవి మూడ్ విశ్వామిత్ర చౌహాన్ ఆంగ్ల నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా డీఎస్పీ కార్యాలయ ఆవరణంలో డీఎస్పీ రెహమాన్ తో కలిసి వాటర్ ఆపిల్ మొక్కను నాటారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ చిన్నతనంలోనే మొక్కల పట్ల మక్కువతో పర్యావరణం పరిరక్షణకై మొక్కలు నాటుతున్న విశ్వామిత్ర చౌహాన్ అభినందనీయుడని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని నూతన సంవత్సరమును పురస్కరించుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు మొక్కలు నాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న విశ్వామిత్ర చౌహాన్ భవిష్యత్తులో మరిన్ని మొక్కలు నాటాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికుడు డిఎస్పీ రెహమాన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.మొక్కలు నాటిన వారిలో జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి గచుంచుపల్లి సిఐ రాయల వెంకటేశ్వర్లు,చుంచుపల్లి ఎస్సై రవికుమార్ ఉన్నారు

