Thu. Oct 8th, 2026

తమ డిమాండ్లు నెరవేర్చాలని కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల(CRT)తో మంత్రి సీతక్క చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగుల క్రమబద్ధీకరణ,మినిమం టైం స్కేల్ మినహా మిగతా అన్నింటికీ ఆమె సానుకూలంగా స్పందించారు. మహిళలకు 108 రోజుల ప్రసూతి సెలవు, ఐదో తేదీలోపు జీతాలు, డెత్ బెనిఫిట్స్ ఇస్తామని హామీ ఇచ్చారు.దీంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. రేపటి నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. ఈ సందర్బంగా సి ఆర్ టి ల ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ సరస్వతి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభ వార్త తెలిపిన మంత్రి సీతక్క కు ఆశ్రమ కాంట్రాక్టు ఉపాధ్యాయ సంఘం( సిఆర్టి) మరియు ఉపాద్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

Share this post...