Wed. Mar 25th, 2026

  • చైనా మంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉంది

J365 న్యూస్, కొత్తగూడెం:

ఉత్సాహభరితమైన ఆనందంతో రంగు రంగుల గాలిపటాలు ఎగురవేసే కాలం ప్రారంభమైంది.గాలిపటాలు ఎగురవేయడంలో పలు జాగ్రత్తలు పాటించాలని వరల్డ్ వైజ్ కన్య్సూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ సౌత్ ఇండియా జాయింట్ సెక్రెటరీ పూదరి శ్యామ్ కుమార్ అన్నారు.మాంజా దారం చర్మాన్ని కత్తిరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వీక్షకులకు,పక్షులకు మరియు రోడ్డు పై ప్రయాణిస్తున్నా ప్రయాణికులకు హాని కలగవచ్చు.దీనిపై జాగ్రత్తలు అవసరం. తల్లిదండ్రులు గాలిపటాలు ఎగుర వేసే సమయంలో సలహా సూచనలు ఇస్తూ.. కుటుంబ సభ్యులు పిల్లలను పర్యవేక్షించాలని ఆయన కోరారు. మామూలు దారాలు కాకుండా చైనా మంజా దారాలను ఉపయోగించడం వలన గాలిలో ఎగురుతున్న పక్షులు కూడా ప్రమాదం జరుగుతుందని గ్రహించాలి. అటుగా వెళ్తున్న వారి మెడకు చుట్టుకొని గొంతు తెగి తీవ్ర రక్తస్రావం జరిగిన సంఘటనలు ఎన్నో….ఇప్పటికే అధికారులు ఇచ్చిన సూచనలను పాటించాలని,యువత ప్రశాంత వాతావరణంలో, ఎవరికి హాని కలిగించకుండా గాలి పటాలను ఎగురవేసేందుకు చూడాలని వరల్డ్ వైజ్ కన్య్సూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ సౌత్ ఇండియా జాయింట్ సెక్రెటరీ పూదరి శ్యామ్ కుమార్ అన్నారు.

Share this post...