సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మహిళలంతా ఉపాధ్యాయ వృత్తిని ప్రేమిస్తూ నిరంతరం విద్యాభివృద్ధికి తద్వారా సమాజ అభివృద్ధికి పాటుపడాలని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ఇన్చార్జి హెడ్మాస్టర్ బాలు నాయక్ అన్నారు. సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా పాల్వంచ మండలంలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించి పాఠశాల ఉపాధ్యాయినీలను సత్కరించారు. సావిత్రిబాయి పూలే సామాజిక కట్టుబాట్లను బెదిరించి బాలికా విద్యకు ఎంతో తోడ్పడిందని తద్వారా నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిందని, ఆమె చూపించిన ధైర్యాన్ని తెగువని స్ఫూర్తిగా తీసుకొని నేటి మహిళా ఉపాధ్యాయులంతా తమ వృత్తికి పునరంకితమవుతూ విద్యార్థులను తీర్చిదిద్దాలని ఇంచార్జ్ హెచ్ఎం బాలు నాయక్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారతకై కృషి చేస్తూ ఈ క్రమంలో సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం ఎంతో ఆనందదాయక మని, మహిళా ఉపాధ్యాయుల సత్కరించుకోవటం విద్యాశాఖ కే గర్వకారణమని సన్మాన గ్రహీత మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ పి వెంకటేశ్వర్లు, వార్డెన్ బి.శంకర్ , పిడి బాలసుబ్రమణ్యం, రమాదేవి, స్వరూప రాణి, బాలు, సతీష్, కోటేశ్వరరావు, రాంధన్, పాపయ్య, విజయమ్మ,సుక్య, రవి,అంజయ్య కార్యాలయ సిబ్బంది వెంకన్న, భాస్కర్, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.