స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బహుజన ఐక్యవేదిక స్టేషన్ ఘన్పూర్ ఆధ్వర్యంలో MRPS మండల అధ్యక్షులు గుర్రం నవీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ అక్కినపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే విద్య ద్వారానే మార్పు సాధ్యమని మహిళలకు విద్య శూద్రులకు చదువు తో మాత్రమే సమానత్వం వస్తుందని నమ్మిన మొట్టమొదటి భారతీయ మహిళా ఉపాధ్యాయు రాలు మూఢనమ్మకాలతో ధర్మం పేరుతో స్త్రీలకు శూద్రులకు విద్య లేకుండా సర్వనాశనం చేసిన ఈ వ్యవస్థకు గొప్ప సంస్కర్త అయి చదువులు నేర్పి ఈ దేశంలో అనేక మార్పులకు కారణమైంది తద్వారా మహిళలు డాక్టర్లు ఇంజనీర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ప్రధానులు రాష్ట్రపతులు ఐఏఎస్ ఐపీఎస్ ఈరోజు కాగలిగారు అంటే పూలే దంపతుల త్యాగాలవల్లనే సాధ్యమైందని అన్నారు.
తల్లి జీవితంలో అవమానాలు జరిగిన తనకు పిల్లలు లేకపోయినా నా బహుజన పిల్లలందరికీ చదువు ఉండాలని చదువులు నేర్పి గొప్ప గొప్ప స్థాయిలో ఉండాలని మూఢనమ్మకాలను తరిమివేసి నిజాన్ని తెలియజేశారు , వారి స్ఫూర్తితో బహుజనులకు రాజ్యాధికారం అందించే విధంగా మహిళలకు సమాజాన్ని చైతన్య పరుస్తూ ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. రైల్వే స్టేషన్ రోడ్డు నుండి పోలీస్ స్టేషన్ పోయే చౌరస్తాలో రాబోయే సంవత్సరములో మహాత్మ జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే జయంతికి ఇదే కూడలిలో వారి విగ్రహావిష్కరణ చేసుకోవాలని విగ్రహాలను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని బహుజన ఐక్యవేదికగా కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ లైన్స్ క్లబ్ అధ్యక్షులు అంబటి కిషన్ రాజ్, బహుజన్ సమాజ్ పార్టీ నియోజవర్గ అధ్యక్షులు జలగం ప్రవీణ్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గాదె పృథ్వి, బీజేపీ జిల్లా సెక్రెటరీ గట్టు కృష్ణ, స్టేషన్ ఘనపూర్ మాజీ సర్పంచ్ నీరటి ప్రభాకర్, చాగల్ మాజీ MPTC కనకం గణేష్,చింత జోసెఫ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జీడి రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,MRPS జిల్లా ఉపాధ్యక్షులు చాడ ఏలియా,LIC జనగాం బ్రాంచ్ అధ్యక్షులు దుస్స చంద్రమౌళి,బీఎస్పీ నియోజవర్గ కార్యదర్శి దండు నాగరాజు, గద్దె అనిల్ గౌడ్ కాంగ్రెస్ నియోజవర్గ లీగల్ సెల్ కన్వీనర్,కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు పండుగా అశోక్, BRS మండల యూత్ అధ్యక్షులు గుండె మల్లేష్, ఒగ్గు రాజు BRS మండల నాయకుడు,MD అన్వర్ BRS మండల నాయకుడు,గంగిరెడ్డి వీరన్న బహుజన నాయకులు, వీర సింగ్ BRS నాయకుడు, తదితరులు పాల్గొన్నారు.