Wed. Mar 25th, 2026

J365 న్యూస్, మణుగూరు

 ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంగ్ల ఉపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ ఆధ్వర్యంలో ఆంగ్ల ఉపాధ్యాయులు గౌరీశంకర్, రవి ప్రసాదు, జ్యోతిలు కోఆర్డినేటర్లుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కో ఎడ్యుకేషన్ మణుగూరులో నిర్వహించిన ఆంగ్ల ఒలింపియాడ్ మరియు ఉపన్యాస పోటీలను ఉద్దేశించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కో ఎడ్యుకేషన్ ప్రధానోపాధ్యాయురాలు జి. నాగశ్రీ మాట్లాడుతూ….. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినీ విద్యార్థులలో ఆంగ్ల నైపుణ్యాలను పెంపొందించుటకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ మరియు ఎస్ సి ఆర్ టి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంగ్ల ఒలింపియాడ్ మరియు ఉపన్యాస పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు.ఆంగ్లంలో మాట్లాడటం, వ్యాకరణ అంశాలలో పట్టు సాధిస్తే విద్యార్థులు పోటీ పరీక్షలు ఎదుర్కొని జీవితంలో స్థిర పడగలుగుతారన్నారు.

ఈ సందర్భంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మీరా హుస్సేన్ మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడులను బలోపేతం చేయుటకు ప్రభుత్వ బడులలో ఆంగ్ల మాధ్యమాన్ని మరింత పటిష్టపరుచుటకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ ( ఎల్టా) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ ఆంగ్ల ప్రతిభ పాటవ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం ఇంగ్లీష్ ఒలింపియాడ్ మరియు ఉపన్యాస పోటీలను నిర్వహించి విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మకతను, బావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంచుటకు ప్రయత్నిస్తున్నామన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఆంగ్ల భాషను కేవలం పరీక్షలలో పాసవుటకే కాకుండా అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ గా నేర్చుకుంటే ఈ గ్లోబల్ విలేజ్ లో ఏ కంట్రీ కి వెళ్ళినా ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందవచ్చు అన్నారు. ప్రపంచ పౌరుడిగా తయారు కావాలంటే ఆంగ్లభాష పరిజ్ఞానం ఎంత అవసరమన్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్టా బాధ్యులు బొల్లు. ఐలయ్య , ఆంగ్ల ఉపాధ్యాయులు గౌరీ శంకర్ రవి ప్రసాద్ జ్యోతి, అన్నపూర్ణాదేవి, మరియు పద్మ, నాగభూషణం విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share this post...