Thu. Oct 8th, 2026

పురుగు మందు తాగి టెన్త్ విద్యార్థి మృతి చెందిన ఘటన జూలూరుపాడు మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బాల్య తండాకు చెందిన చరన్ ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాడు. జనవరి 1న కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లలేదని కుటుంబ సభ్యులు మందలించగా.. చరణ్ పురుగు మందు తాగాడు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ పాపారావు కేసు నమోదు చేశారు.

Share this post...