Wed. Mar 25th, 2026

J365 న్యూస్: 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు,GRSS ఛైర్మెన్ భూక్య సంజీవ్ నాయక్ SSA ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొపెసర్ కోదండరాం కు చరవాణి ద్వారా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగాసేవాలాల్ సేన మద్దతు ఇస్తారని ఆందోళనకు సిద్ధమవుతారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర కో కన్వీనర్ బానోత్ హుస్సేన్ నాయక్,రాష్ట్ర కో కన్వీనర్ లకావత్ భాస్కర్ నాయక్,సేవాలాల్ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకులు సపావత్ బాలకృష్ణ చౌహన్,భూక్య బాబులాల్ నాయక్,రామకృష్ణ నాయక్, పాల్వంచ మండల అధ్యక్షులు పరమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share this post...