J365 న్యూస్,సూర్యపేట:
సూర్యాపేట జిల్లా దూరజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల జాతర హాల్లో యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మట్టుపల్లి రామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ కార్యక్రమం లో వరంగల్ మాజీ కూడా చైర్మెన్, టీచర్స్ ఎమ్మెల్సి అభ్యర్థి సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ ,మాజీ రాజ్యసభ సభ్యు బడుగు లింగయ్య ,కోదాడ మాజీ ఎమ్మెల్యే గొల్ల మల్లయ్య యాదవ్ , హాజరై ఉద్యోగుల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ. సూర్యాపేట జిల్లా యాదవ ఉద్యోగులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నుండి టీచర్స్ అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలన్నారు.

