Wed. Mar 25th, 2026

  • సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె నీటికి 27వ రోజుకు చేరుకుంది.

J365 న్యూస్.కొత్తగూడెం:

సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని, మరణించిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ కల్పించాలని, పి టి ఏ లకు 12 నెలల వేతనం అందించాలని, రియల్ విధానాన్ని పూర్తిగా ఎత్తేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న ఈ సమ్మె చాలా న్యాయమైనదని ఈ సందర్భంగా సంజీవ నాయక్ పేర్కొన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అధికారంలోకి రాకముందు స్వయంగా మీరే వీరి సమ్మె శిబిరం వద్దకు విచ్చేసి ఇచ్చినటువంటి హామీని మర్చిపోతే మరి మీ స్థాయి వ్యక్తులు మర్చిపోతే ఇంకా కింది స్థాయి వాళ్ళు మాట తప్పడంలో తప్పేముందని ఈ సమాజానికి మీరు ఎలాంటి సూచనలు చేయదలుచుకున్నారని సందర్భంగా ప్రశ్నించారు. కేవలం ఓట్లు దండుకోవడమే పనిగా పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లి లేనిపోని అబద్ధాలు చెప్పి ఆశలు కల్పించి అధికారంలోకి రావడమే పనిగా పెట్టుకోకూడదని అధికారంలో వచ్చిన తర్వాత వారి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని గుర్తించాలని కోరారు.

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే సంజీవ నాయక్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతాడని ఉద్యోగుల సమస్యలు సాధించేవరకు వెనక్కి తిరగని ఈ సందర్భంగా ఉద్యోగులకు హామీ ఇచ్చారు.సమగ్ర శిక్ష విద్యకు ఇప్పటికే అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు నిత్యాయని అయినప్పటికీ కొన్ని ఉపాధ్యాయ సంఘాల నుండి ఉపాధ్యాయులను పళ్లకు పంపడం ఏమాత్రం సమంజసం కాదని రేపు మీకు ఈ సమస్యలు వస్తే ఈ ఉద్యోగులే ఆదుకుంటారని గుర్తు చేశారు.ఉపాధ్యాయ లోకం మొత్తానికి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందుతున్నాయని ముందు అది గుర్తు ఎరగాలని సూచించారు.

 

Share this post...