J365 న్యూస్, వరంగల్ జిల్లా:
వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నడుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామం నుంచి జగన్ తండా, చంద్రు తండా లను కలుపుతూ పర్వతగిరి వరకు ఆర్ & బి నిధులు సుమారు 4.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్న బి.టీ రోడ్డు కు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు .
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంతన్న నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం జోడేడ్ల మాదిరి సాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు లు, ఆరోగ్య శ్రీ కార్డులు అందిచమని మళ్ళీ నేటి ఇందిరమ్మ ప్రభుత్వంలో త్వరలో అర్హులకు రేషన్ కార్డులను,డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డుల జారికీ ప్రభుత్వం సన్నద్ధం అవుతుందాన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించడానికి సిద్ధంగా ఉందన్నారు. డిజిటల్ రేషన్, హెల్త్ కార్డుల ప్రక్రియకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఒక పట్టణం, ఒక గ్రామాన్ని ఎంచుకునే విషయాన్నీ గుర్తు చేశారు.
అలాగే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రైతు రుణమాఫీ చేసిన గొప్ప ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం మరియు రైతులకు ఈ నెల జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకం క్రింద ఏడాదికి 12000 ఇవ్వనున్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం దయచేసి ప్రజలందరూ బిఆర్ఎస్ బిజెపి నాయకుల మాయమాటలకు మోసపోకుండా అన్నం పెట్టే కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు….
