—హర్షం వ్యక్తం చేసిన మున్నూరుకాపు నాయకులు.
మణుగూరు,19 నవంబర్ (J365news) తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలను మున్నురు కాపులు కోరడమైనది. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మున్నూరు కాపు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా మున్నూరు కాపు యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాల పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయ హస్తం చేర్చి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే అమలు చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తు హర్షం వ్యక్తం చేస్తూన్నమని పినపాక నియోజకవర్గ మున్నురుకాపు సంఘ నాయకులు వలసాల. వెంకటరామారావు నాయకులు గాండ్ల సురేష్, బొడ్డు.ఏసుబబు, వారాల.వేణు, దాచేపల్లి. శ్రీను, కుర్రి. చలపతి రావు, పులిశెట్టి.బాబు ,వెంకటేశ్వర్లు తదితరులు మున్నూరుకాపు సంఘ కార్యాలయం వద్ద ఈ రోజు హర్షం వ్యక్తం చేశారు.