భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం శేషగిరి నగర్ గ్రామపంచాయతీలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు సభను జయప్రదం చేయాలని జనవరి 18న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పల్లి మండల కార్యదర్శి లక్ష్మీపతి, సహాయ కార్యదర్శి దారా శ్రీను, యువజన సంఘం నాయకుడు సాయి, జిల్లా కౌన్సిల్ సభ్యురాలు ఆర్గనైజ్ సెక్రటరీ కరిష రత్నకుమారి, ఉపసర్పంచ్ రామ్ రెడ్డి, వార్డు సభ్యులు ధర్మ, రాములు, గ్రామ సీపీఐ కార్యదర్శి అంబేద్కర్ పాల్గొన్నారు.అలాగే బానోత్ శాంతి, పాకాల లక్ష్మి, రేణిగుంట్ల లక్ష్మి, మదనమ్మ, కుంటి పుష్ప, రాజమణి, వెంకట నరసమ్మ, జై మునిసా తదితరుల సారథ్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది
