Thu. Jan 29th, 2026

    సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా కిన్నెరసాని గ్రామ పంచాయతీలో సర్పంచ్ వజ్జ రామకృష్ణ మరియు ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజా ఆధ్వర్యంలో కిన్నెరసాని క్రీడ మైదానంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ ముగ్గుల పోటీలకు స్థానిక మహిళలు యువతులు ఉత్సంగా రంగు రంగుల ముగ్గులు వేసి అబ్బుర పరిచారు.సంక్రాంతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ముగ్గుల పోటీల ద్వారా మహిళల్లోని కళాత్మకతను ప్రోత్సహించడంతో పాటు, ప్రజల్లో పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహించమని నిర్వాహకులు తెలిపారు. గెలిచిన వారికి కొత్వాల శ్రీనివాస్ బహుమతులు అందజేశారు.ముగ్గుల పోటీలో మొదటి బహుమతి తాటి రామ,ద్వితీయ బహుమతి బోనగిరి శ్రీలత,తృతీయ బహుమతి బుడగం హేమలత.ఈ ముగ్గుల పోటీలకు ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులను వజ్జ శ్యామ్ దంపతులు స్పాన్సర్ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వజ్జా రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జ ఇంద్రజా, వార్డ్ మెంబర్లు కట్ట సోమయ్య, రోజా, వజ్జ విజయ్, తాటి సురేష్, కల్తీ ప్రవీణ్ కుమార్, కోర్సా వినిత, తాటి సాంబలక్ష్మి, శెట్టిపల్లి కళ్యాణి, గుమ్మడి లక్ష్మి,మొక్కటి ధనలక్ష్మి,అడ్వకేట్ అంబేద్కర్, కాంగ్రెస్ నాయకులు జాలే జానకిరెడ్డి, యర్రంశెట్టి ముత్తయ్య, కోండం వెంకన్న, కట్టా సోమయ్య, పైడిపల్లి మహేష్,ఉండేటి శాంతివర్ధన్, దాసం చైతన్య కుమార్,బొర్రా ఉదయ్ కుమార్, మొగిలి కిషోర్ వజ్జ బక్కయ్య స్థానిక ప్రజలు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు

Share this post...