Thu. Jan 29th, 2026

  ఆదివాసీల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన పోరాట యోధుడు కొమరంభీం అని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్( డి సి యం ఎస్) మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.పాల్వంచ మండలం పరిధి కిన్నెరసాని పంచాయతీలోని రాజపురం – కిన్నెరసాని యూత్ ఆధ్వర్యంలో వజ్జా విద్యాసాగర్ జ్ఞాపకార్ధం కొమరంభీం పేరుమీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. *పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, ఆళ్ళపల్లి, ములకలపల్లి మండలాల స్థాయిలో* జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో విజయం సాధించిన విజేతలకు మొదటి బహుమతి క్రింద 15,116 రూపాయలు, రెండవ బహుమతి క్రింద 10,116 రూపాయలు, విన్నర్, రన్నర్ కప్ లు కొత్వాల బహుకరించారు. మొదటి బహుమతి సాటివారిగూడెం జట్టు, రెండవ బహుమతి కిన్నెరసాని జట్టు గెలుచుకున్నాయి.ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు కొత్వాల బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ మండల స్థాయిలోని క్రీడాకారులు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయికి ఎదగాలన్నారు.ఈ కార్యక్రమంలో కిన్నెరసాని సర్పంచ్ వజ్జా రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ, బంజారా సర్పంచ్ మొక్కటి ధనలక్ష్మి,అడ్వకేట్ అంబేద్కర్, కాంగ్రెస్ నాయకులు జాలే జానకిరెడ్డి, యర్రంశెట్టి ముత్తయ్య, కోండం వెంకన్న, కట్టా సోమయ్య, పైడిపల్లి మహేష్,ఉండేటి శాంతివర్ధన్,దాసం చైతన్య కుమార్,బొర్రా ఉదయ్ కుమార్, మొగిలి కిషోర్ స్థానిక నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Share this post...