J365news, Kothagudem: స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని గణేష్ టెంపుల్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాలవేసి నివాళులర్పించి ప్రసంగించిన సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ ,సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లైజన్ ఆఫీసర్ కలవల చంద్రశేఖర్. ఇనుప కండరాలు ఉక్కు నరాలు గల యువత స్వామి వివేకానంద గారి అడుగుజాడల్లో నడవాలని అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో భారతదేశ ప్రతినిధిగా హాజరై తన ప్రసంగంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా మాట్లాడారన్నారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి పేదవారికి సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో రామకృష్ణ మిషన్ ను స్థాపించి ఎందరో అభాగ్యులను అక్కున చేర్చుకున్నారని మానవసేవే మాధవ సేవగా తన జీవితాన్ని కొనసాగించారన్నారు.ఎంతోమంది మహనీయులు స్వామి వివేకానంద రచనల ద్వారా స్ఫూర్తిని పొందారన్నారు.
నేటి యువత అనేక రకాల వ్యసనాలకు గురికాకుండా స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్వామి వివేకానంద స్ఫూర్తితో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే సామాజికవేత్త లగడపాటి రమేష్ చంద్ ని భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెలోషిప్ ప్రతినిధులు లోగాని.శ్రీనివాస్ ఖాసిం,జ్యోతి రాణి,డాక్టర్ నూరి,చుంచు అంజమ్మ, రాజేశ్వరరావు,గుమలాపురం సత్యనారాయణ,చంద్రశేఖర చారి,పరమేష్,ముత్యాల హనుమంతరావు,పుల్లయ్య మంచినీళ్ల బిక్షం,కౌన్సిలర్లు రుక్మందర్ బండారి,బాలిశెట్టి సత్యభామ,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రావి. రాంబాబు తదితరులు పాల్గొన్నారు

